Sunday, November 24, 2013

బాధలెందుకు?

ప్రశ్న: సద్గురు, సృష్టి స్వయం సంపూర్నమైతే, సృష్టికర్త మనకు ఎంతో మంచి చేసిన వాడైతే, ఈ ప్రపంచం లో ఇన్ని బాధలెందుకు ఉన్నాయి? మనం ఇతరుల దయ మీద, సానుభూతి మీద ఎందుకీ ప్రపంచంలో ఆధారపడి బతకాల్సి వస్తోంది?


సద్గురు:(నవ్వుతూ) అంటే సృష్టి సంపూర్ణం అయినదే అయితే ఇన్ని చింతలు ఈ లోకం లో ఎందుకు ఉన్నాయి? అదెంత స్వసంపూర్ణమంటే నువ్వెలాగ ఉండాలనుకుంటే అలాగుండే అవకాశాన్ని నీకిస్తుంది.సృష్టి ఒకవేళ నువ్వు ఉండాలనుకున్తున్నట్టుండే అవకాశం నీకిచ్చి ఉండకపోతే ప్రపంచంలో ఇన్ని అవకాశాలు ఉండేవా? అప్పుడు 'విమోచనం' అనే పదం ఉండేదికాదు. ఎందుకు అనవసంగా బంధాలు పెంచుకోవడం మల్లి వియోచన కోసం పాకులాడటం. కేవలం వియోచనే ఎందుకు ఉండకూడదు? మరి అప్పుడిక సృష్టే ఉండదు. సృష్టి ఉందికనుకే, దానికన్నా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది.

జంతువు,ఇతర రూపాల్లో మన చుట్టూ కన్పించే జీవం మొత్తంలో ఈ అవకాశం లేదు కదా! ఈ అవకాశం జీవితంలో మనుగడ సాగించడానికి, పునరుత్పుత్తి చేయడానికి,జీవితాన్ని కొనసాగించి ఏదో ఒకరోజు పోవడానికి. ఎక్కువ అవకాశం లేకపోవడం వల్ల, ఎక్కువ చింత కూడా లేదు. మనిషి లాగా ఈ భూమ్మీద బతికే ఏ ఇతర ప్రాణీ బాధపడటం చూడం. వాటి బాధంతా శారీరకం మాత్రమే. శరీరానికి దెబ్బ తగిలితే వాటికి నొప్పి కలుగుతుంది. నొప్పిలో కూడా, మనిషి అనుభవించే నొప్పి వాటికి తెలీదు.

మనిషిగా నీకు ఎటువంటి బాధ తెలుసుంటే ఇది సృష్టి నీకు ఇచ్చింది కాదు.

No comments:

Post a Comment