Tuesday, August 27, 2013

దేవతలకు – ప్రేతాత్మల మద్య ఉన్న దూరం చాలా స్వల్పం

మనిషిలో భావ శరీరానికి మనస్సుకు లింక్ ఏర్పడివుంది . అందువల్లనే మనస్సు కల్పించినట్లు స్పందనలు కలుగుతాయి.
కాని మానస శరీరం అందరికి ఏర్పడడం లేదు. మనస్సు పై ఆదిపత్యం ఏర్పడితే తప్ప మానస శరీరం ఏర్పడదు. అంటే అనాహత కేంద్రం చైతన్యం పొందితే తప్ప మానస శరీరం ఏర్పడినట్లు కాదు.
అనాహత కేంద్రం వరకు వెళ్ళిన వారు, నాల్గవ దైన మానస శరీరం పొందిన వారు ఇక్కడ మృతి చెందిన తరువాత దేవత లవుతారు. పైలోకాలలో దేవతలుగా అవతరిస్తారు.
మూడవ శరీరం వరకు సాధించిన వారు తిరిగి మనిషిగా జన్మించవలసి ఉంటుంది.
నాల్గవ శరీరం తర్వాతనే ఉత్తమ జన్మలు. మహర్లోక ప్రాప్తి. యోగంలో నాల్గవ శరీరం సాధించిన జీవి తిరిగి భౌతిక శరీరాన్ని కోరడు. మరొక జన్మకు రాదు. కాదంటే పైలోకాలకు వెళ్ళే అర్హత పొందేవరకు అరుప స్థితిలో ఉంటాడు.
రూప, ఆరూప స్థితులు రెండూ మానస శరీరం పరిదిలోనివే నని గమనించాలి.
మానస శరీరాన్ని అనుభూతి చెందినంత మాత్రాన సరిపోదు. స్పష్టంగా ఏర్పడాలి. స్పృహ, చైతన్యం అనేవి తోలిమెట్లు మాత్రమే. అవి నీడల వంటివి.
స్పృహ మాత్రమే మిగుల్చుకున్న వారు ప్రేతాత్మలుగా మారతారు. వీరినే నీచ దేవతలంటారు.
చైతన్యం పొందిన వారు దేవతలవుతారు. వారు ఉచ్చ దేవతలు. వీరి ఆవాసం స్వర్గలోకం. నీచ దేవతల నివాసం నరకలోకం. దేవతలకు, ప్రేతాత్మలకు ఉన్న దూరం చాల స్వల్పం.
ప్రేతాత్మలకు తెలియదు దేవతలూ తమవంటి వారే నని. శక్తి విషయంలో ఇరువురూ సమానమే. దేవతలు తమ ఆధిక్యత వల్ల, ఉన్నత లోకంలో ఉన్నందు వల్ల పూజింపబడుతున్నారు. ప్రేతాత్మలు నూన్యతాభావంతో వుంది, చెడ్డ పనులు చేస్తూ భయపెడుతుంటారు. ప్రేతాత్మలకు కొన్నింటికి ఆత్మజ్ఞానం ఉంటుంది. అలాంటివి మంచి పనులు చేస్తాయి. నాల్గవ శరీరం వరకు సాధించి చైతన్యం పొందితే మరణం తర్వాత దైవత్వం పొందగలరు.
స్వప్రజ్ఞ - దేవతలు, ప్రేతాత్మలు ఇవ్వరు!
అయిదవది ఆత్మ శరీరం. దీనిని సాధించిన జీవుడు దేవలోకాలు ధాటి సరాసరి ఊర్ద్వ లోకాలకు చేరతాడు.
అయిదవలోకంలో చైతన్యం, ప్రజ్ఞ కలగలసి ఉంటాయి. అంటే ఒక్కటై పోతాయి.
చైతన్యం పొందనిది, స్ఫూర్తి చెందనిది ఎవరూ ఆత్మ లోకాన్ని చేరలేరు.
చైతన్యం, ప్రజ్ఞ సమంగా ఏర్పడాలి. చైతన్యం కలగకపోయినా నాల్గవ భూమికను చేరవచ్చు, దేవుళ్ళు కావచ్చు. దేవతలై స్వర్గంలో తిష్ట వేయవచ్చు. చైతన్యంలో ప్రయాణం మలుపు తిరుగుతుంది. నాల్గవ మండలాన్ని చేరడం, దేవతలు కావడం జరుగుతుంది. ప్రజ్ఞ చైతన్యానికి తోడైతే ఆత్మ మండలం చేరగలరు. ఆత్మలకు ఆలంబనాలు చైతన్యం, ప్రజ్ఞ. అయిదవ మండలం తర్వాత రెండూ ఏకమై ఒక్కటిగా వుంటాయి.
నాల్గవ భూమిక వరకు నిద్ర వేరుగా, జాగృతి వేరుగా ఉంటుంది. ఆ తర్వాత నిద్ర, జాగృతి రెండూ చైతన్యంగా మారతాయి. ఈ చైతన్య ప్రజ్ఞ దేవుళ్ళు అనుగ్రహించేది కాదు. ప్రీతాత్మలు కనికరించి ఇచ్చేది కాదు. అది స్వప్రజ్ఞ.
దేవతలు కూడా పైలోకాలకు వెళ్ళాలంటే తిరిగి మానవ జన్మ ఎత్త వలసిందే!
ప్రేతాత్మలకు అయిదవ శరీరాన్ని ధరించే అర్హత ఉండదు. అసలవి ఆత్మ లోకంలో ప్రవేసించ లేవు. చైతన్యం నిలవడానికి అవసరమైన శరీరం వాటికి ఏర్పడదు. భౌతిక శరీరంతో ఉండగానే చైతన్యం పొందగలిగిన వారు ఆ స్థితికి చేరుకోగలరు. అప్పుడే జీవుడు సరాసరి ఆత్మలోకంలో ప్రవేశించి, చైతన్య ప్రజ్ఞను నింపుకుని ఆత్మ శారీరి కాగలడు.
దేవతలుగా మారి స్వర్గ సౌఖ్యాలు అనుభవించే వారైనా పైలోకాలకు వెళ్ళాలంటే తిరిగి మానవ జన్మ ఎత్తి , చైతన్య ప్రజ్ఞ సముపార్జించుకుని, ఆ ప్రజ్ఞతో మహార్లోకాలు చేరవలసి ఉంటుంది. అలా రెండవ సారి జన్మించినప్పుడు విస్మృతి ఉండదు. లక్ష్యం చెడదు. పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. తన జీవిత గమ్యం ఇది అని ముందుగానే నిర్ణయించు కోవడం జరుగుతుంది. అలాంటివారు సుఖ దుఃఖాలకు అతీతంగా జీవిస్తూ కారణజన్ము లనిపించుకుంటారు.
సాధకులు స్వర్గంపై మోజు వదులుకోవాలి!
యోగి అయినవాడు బొత్తిగా ఆశించిదగినది కాదు స్వర్గం. భోగలాలసలు కోరేది స్వర్గం. అది అంత సుఖవంతమైనది కాదు. అక్కడ ఆనందం లభించదు. సుఖాలను తృప్తిగా మార్చుకుని అనుభూతించడానికి భౌతిక శరీరాలు, ఇంద్రియాలు ఉండవు. మహా స్తబ్దంగా bore గా ఉంటుంది. క్షణాల మీద కోరిన ప్రతి కోరిక తీరుతుంటే మజా ఏముంటుంది! నిరీక్షణలోనే కదా సుఖప్రాప్తి!
ఎంతకాలం స్వర్గంలో సుఖాలు అనుభవించినా ఎవరూ ఒక్కమెట్టు పైకి వెళ్ళే అవకాశం రాదు. అసలు పై లోకాలకు వెళ్ళే త్రోవ మూత పడుతుంది. ఆ సుఖలాలసలో పైలోకాలున్నాయని జ్ఞాపకం రాదు. మనిషిగా బ్రతికినంత కాలం స్వర్గాన్నైనా వాంచిస్తాడు. ఆ స్వర్గం చేరాక వాన్చిన్చవలసింది ఏమీ ఉండదు. మనిషిగా భూలోకంలో ఉన్నంత కాలం ఎన్ని సుఖాలు భోగాలు కోరినా, అనుభవిస్తున్నా విసుగు పుట్టాక పోవచ్చు. రోత కలగకపోవచ్చు. ఇక్కడ ఒక సుఖానికి మరో సుఖానికి మద్య విరామం ఉంటుంది. మనిషి వయస్సుతో పెర్గుదల, కోరికల తరుగుదల ఉంటుంది. స్వర్గంలో అలా కాదే! ఎల్ల కాలం నిత్య యవ్వనంతో ఉంటారేమో తూనీగల లాగా ముసురుతాయి కోరికలు, సుఖాలు. అక్కడి వారికి పుట్టడం, పెరగడం, మరణించడం లాంటివి ఉండవు. ఒకే యవ్వనంతో స్వర్గంలో అవతరించడం, విసుగు పుట్టినప్పుడు అంతర్ధానం కావడం. అంతే! ఎవరు ఎలా వస్తున్నారో, తిరిగి ఎక్కడికి పోతున్నారో అక్కడి వారికి తెలియదు. అసలు ఎవరూ పట్టించుకోరు. అన్ని భోగాలు అనుభవించినా ఒక్క రోజులో విసుగు పుడుతుంది. అసహ్యం వేస్తుంది. అందుకే దేవతలకు మనుషుల్ని చూస్తే అసూయ, వీరి పైన మోజు, ఎప్పుడు మానవ జన్మ ఎత్తుదామా, ఇలా బ్రతుకుదామా అనుకుంటారు. మనం వారి చర్యల్ని గమనించలేము గాని, వారు మన చర్యలని గమనిస్తుంటారు. మానవులపై మక్కువ కొద్దీ ప్రేమ కొద్దీ మనం అడిగిన వరాలు అనుగ్రహించి మంచి చేసుకుంటారు. సాధకులు మొదటనే స్వర్గంపై మోజు వదులుకోవాలి.

సాధకునికి తొలినుండి ఏర్పడవలసింది సత్య ద్రుష్టి, ఆత్మ జిజ్ఞాస. అటువంటి సాధకుడు అవాంతరాలను అలవోకగా దాటిపోగలడు. అతనికి సత్యం ఒక్కటే ధ్యేయంగా ఉంటుంది. చైతన్యం ఒక్కటే మార్గం అవుతుంది. ఆ లక్ష్యం చెదరనప్పుడు యోగి ఆత్మశరీరంతో ఆగిపోడు. ఆరంభంలోనే గమ్యం నిర్దేసిన్చుకుంటాడు కనుక, మధ్య ఏర్పడే అవాన్తరాలన్నీదాటిపోగాలుగుతాడు. చిన్న చిన్న ప్రలోభాలు తలెత్తినా సంయమనంతో వాటిని అణిచిపెట్టగలడు.

No comments:

Post a Comment