Wednesday, July 3, 2013

మనోప్రస్థానం: అసలు మీకో రహస్యం తెలుసా?


యోగానికి మనస్సుకు పడదు. రెండూ బద్ద శత్రువులని కాదు. కానీ ఒక ఒరలో ఇమడవు. ఆలోచనల్ని అదుపు చేసి, మనస్సును ప్రశాంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. ఎంత ప్రయత్నించినా ఆలోచనలు ఆగవు. పైగా ప్రతి ఆలోచన అవసరమే అనిపిస్తుంది. అసలు మనసు పని ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తుండడమే.

వాటంతట అవిగా వచ్చే ఆలోచనలు మనల్ని disturb చేయవు. వాటి వల్ల మనస్సు కలత చెందదు.

మనం అతిగా ఆలోచించినప్పుడే మైండ్ disturb అవుతుంది. సహజంగా ఉత్పత్తి అయే భావాలు మనం కావాలని చేసే ఆలోచనలు కావు. అది నిజానికి ఆలోచించని స్థితి. ఆలోచించడం అనే ప్రక్రియ చిత్తవృత్తి. అది మానసిక ప్రవృత్తి. అది అంతరంగ తరంగం. అంతర్మధనం.

అసలు ఆలోచించడం అంటే ఏమిటి?
మనం ఎందుకు ఆలోచించాలి?
ఎలా ఆలోచించాలి?

మనస్సును పదును పెట్టడం, చైతన్య పరచడం ఆలోచన. అవి మన జ్ఞాపకాలు.

జ్ఞాపక శక్తి ఎక్కువుగా కలవారిని మేధావులు అంటారు. వారిని జ్ఞానులు అనరు. వారు స్వంతంగా ఏమీ ఆలోచించరు. లోపల ఉన్న నిల్వలను బయటకి తీస్తారు.

స్వంతంగా ఆలోచించగల వ్యక్తి పాత వాటిని జ్ఞాపకం పెట్టుకోదు. తాను ఫ్రెష్ గా నిర్ణయాలు చేస్తాడు. కొత్త భావాల్ని ఎప్పటికప్పుడు సృష్టించుకుంటాడు. కొత్త సత్యాలను ఆవిష్కరించుకోగలడు. జ్ఞాపక శక్తిని ' ధారణ ' అనవచ్చు. సత్యావిష్కరణ మనోప్రస్థానం లోనిది.

'జ్ఞానం' కలగాలంటే 'విచారణ' ముఖ్యం. 'ధారణ' అవసరం లేదు. విచారణ వల్ల 'సత్యం' అవగతమవుతుంది. విచారణ సత్యానికి దగ్గరగా తీసుకుపోతుంది.

చాలా మంది అహంకారాన్ని గర్వంగా భావిస్తుంటారు. గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన. 'నేను' కు మూలం వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.

' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు. ' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. 'అహమాత్మ' అని అర్థం. 'నేనే బ్రహ్మం' అన్నాడు అచల గురువు. 'నేను' అంటే అహాన్ని వదిలిన 'ఆత్మ' అని కావచ్చు. అంటే అహానికి రెండు ముఖాలు ఉన్నట్లు అర్ధమవుతుంది.

మన మైండ్ negative గాను, positive గాను పనిచేస్తుంది. Negative మైండ్ అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. Negative మైండ్ లక్షణాలు గర్వం, అహంభావం. Positive మైండ్ లక్షణాలు వినయం, అణుకువ. Negative మైండ్ చెడునే ఆలోచిస్తుంది. చెడునే ఆశ్రయిస్తుంది. పోసివే మైండ్ మంచిని ఆస్వాదిస్తుంది. మంచికి ఆశ్రయం ఇస్తుంది. పైగా అహంకారాన్ని కరిగించి వేస్తుంది. అంటే అవి రెండూ అనుకూల, ప్రతికూల స్పందనలు. 'నో ' అనడం ఎప్పుడూ ప్రతికూలమే. 'ఎస్' అన్నది అనుకూల స్పందన. ప్రతి దానికి ' నో ' అనే వారిలో అహంకారం కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది. మొండితనం దొంగ చూపులు చూస్తుంది. 'ఎస్' అనే వారు అన్నిటికీ సర్దుకు పోగాలుగుతారు. వారిలో ఆహాకారం బొత్తిగా ఉన్నదనిపిస్తుంది.

సత్య యోగ సాధకులు ఎవరైనా సత్య శోధన లక్ష్యం గా ముందుకు సాగుతారు. వార్ సంప్రదాయాని ఖాతరు చేయరు. వారి సాధన, ఆలోచన కొత్తగా సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. కనుక వారిలో అహంకారం ఉండదు. కొత్త మార్గాన్ని అనుసరించేవారు విజయాని లక్ష్యంగా పెట్టుకుంటారు తప్ప గర్వపడే ప్రసక్తి లేదు.

మనం ద్వంద స్థితిలో ఉంటాం. పాజిటివ్ గా ఉండి అడ్డంకుల్ని తోలిగించుకోవాలని ప్రయత్నిస్తాం. అయినా సమాజం మన కాళ్ళకు బంధాలు వేస్తుంది. ఒక పట్టాన కధలనీయదు. కొన్ని సందర్భాలలో స్వతంత్రించ లేకపోవచ్చు. అయినా మనం స్వేచ్చను వదులుకోలేము. స్వతంత్రిస్తాము. స్వతంత్రంగా వ్యవహరిస్తాం.

చిత్రం ఏమిటంటే అనుకువుగా, వినయంగా ఉండి, పాజిటివ్ గా ఆలోచించగలిగితే ఫలితం ఆలస్యం కావచ్చు కానీ అపజయం ఉండదు. ఎవరేం చెప్పినా 'ఎస్' అని తలూపితే మనలోని 'అహం' చప్పబడి పోతుంది.

'అహంకారం' , 'అస్మితం' అనేవి 'ఈగో' కి రెండు ముఖాలు. 'నేను' ను చేడగోట్టేది అహంకారం. వాస్తవానికి ఆ రెండు గుణాలు మన లోపలివే. 'అస్మిత' లో సాత్వికమైన అహంకారం తొంగిచూస్తుంది. ఒక మహర్షి లోని లేదా మహాయోగి లోని గంభీరతను 'అస్మితం' అనవచు. దానిని 'అహంకారం' గా సామాన్యులు భ్రమపడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment