Saturday, June 29, 2013

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి

                      

నేను నా మిత్రులిద్దరూ కలిసి పార్టనర్లుగా ఒక కంపెనీ పెట్టాం.నా మిత్రులు తమ పదవి మర్చిపోయి కార్మికులతో స్నేహంగా ఉండేవారు.కార్మికుల్లో భయం అనేది లేకపోతే రేపు మన భుజం మీద చేయివేసి కబుర్లు చెప్పవచ్చు! పని దేబ్బతినవచు.అందువల్ల నేనుమాత్రం ఎప్పుడూ వాళ్ళతో గంభీరంగా మసలుకునేవాడిని.దీంతో నా మిత్రులకేమో మంచి పేరు,కంపెనీ కోసం కష్టపడుతున్న నాకేమో చెడ్డపేరు.ఇదేం న్యాయం?

నిజం చెప్పాలంటే మనుష్యుల్ని కటినమైనవాళ్ళు,మృదువైనవాళ్ళు అని విడదీసి చెప్పలేం! సంతోషంగా ఉండేవాళ్ళు,సంతోశంగాలేనివాళ్ళు అని మాత్రమే విడదీయగలం!
మీరు కటినంగాప్రవర్తిస్తున్నారంటే సంతోషం లేకుండా ఉన్నారని అర్థం.మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కడ మీ నెత్తేక్కి కూర్చుంటారోనన్న సందేహమే మీ ఆనందాన్ని హరించేస్తుంది.

'నేను యజమాని ','అతడు పనివాడు' అనే ముద్రలు వేసుకోవడంవల్ల అహంకారం మొదలవుతుంది,అనుమానం పుడుతుని,ఆనందం అంతమవుతుంది.

ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు అతనితో కలిసి పనిచేయడం చాల సులభం.అదే వ్యక్తి ఆనందం పోగొట్టుకున్నాక అతనితో పనిచేయడం చాల కష్టం.

మీ కంపెనీకి లాభాలు వస్తున్నాయంటే,కార్మికులతో కలిసి మెలసి ఉంటున్న మీ స్నేహితులే తప్ప మీరు కారణం కాదు.ముందుగా ఎదుటివాళ్ళని తేలికగా చూసే గుణాన్ని మార్చుకుంటే మంచిది.

ఒక అడవిలో నాలుగు చీమలు వెళ్తున్నాయి.ఎదురుగా ఒక ఏనుగు వచ్చింది."రేయ్! వీడేంట్రా మన దారికి అడ్డు వస్తున్నాడు. చంపేద్దాం!" అంది ఒక చీమ.

"ఛీ చిన్నవాడు వాడితో ఏంటి? అయినా ఆ నాలుగు కాళ్ళు విరిచేస్తే బుద్ధి వస్తుంది" అంది రెండో చీమ.

మూడో చీమ, "అవన్నీ ఎందుకు వాణ్ణి అలా పక్కకు విసిరేసి మన దారిన మనం పోదాం" అంది. నాలుగో చీమ ఏనుగును ఫై నుంచి కిందికి ఓసారి చూసింది. "ఇది ఏం బాగోలేదు" మనం నలుగురం.వాడు ఒంటరివాడు.నలుగురు ఒకడితో యుద్ధం చేయడం ధర్మం కాదు, మన బలానికి చేటు,వీరానికి తక్కువ. అందువల్ల వాణ్ణి క్షమించి మనం పక్క నుంచి వెల్లిపోదాం" అంటూ పక్కగా మల్లిపాయింది.

మనం అనుకునేది నిజం, సరి అనే అహంకారం వస్తే ఈ చీమల్లాగే ఏనుగును కూడా తక్కువగా అంచనా వేసే గుణం మనకు అలవడుతుంది.

ఆటలో,కార్యలయమో,వ్యాపారమో...ఎక్కడైనా సరే, ఏ విభాగమైన సరే,అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.అందరూ చక్కగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే,అక్కడ సంతోషం,ప్రశాంతత వుంటాయి.

అన్నిటా పోటీతత్వం ఎక్కువైన ఈ రోజుల్లో ఎదురుచూడకుండా వచ్చిపడే సమస్యలు ఎన్నోవుండగా,తోటి మనుషుల్ని మనకు సమస్యగా మార్చుకోవటం కంటే పిచ్చితనం మరేదన్నా ఉందా?