Friday, June 28, 2013

అసతోమా సద్గమయ - తమసోమా జ్యోతిర్గమయ

జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఆధారం చేసుకుని గమ్యం వైపు పయనించాలి! మెల్లగా నత్త నడక నడుస్తావో, పంచకళ్యాణి లాగా పరుగు తీస్తావో నీ యిష్టం. నీ శక్తి - కాని లక్ష్యం చెడకూడదు. గమ్యం కనుమరుగు కాకూడదు. కొందరికి వెంటనే అవకాసం వస్తుంది, మరి కొందరికి జీవితంలో ఎప్పుడో వస్తుంది. అంతవరకు నిరీక్షించక తప్పదు.
వేదాంతులు, సన్యాసులు, ఈ ప్రపంచం అశాస్వతమని చెబుతారు. కనిపించే ప్రపంచం మిధ్య అంటారు. ఈ వాదాన్ని ప్రతివారు నమ్మినట్లే నటిస్తారు కానీ నమ్మరు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలోనే బ్రతుకుతూ, అశాశ్వతమైన సుఖభోగాలకు, డబ్బుకు దాసోహం అంటారు. నిజమేనా?
కాదు, ప్రపంచం ఉంటుంది, ప్రపంచాన్ని అంటి పెట్టుకున్న విలువలు ఉంటాయి. మనుషులు మారిపోతుంటారు. అలా జీవించి ఉండకపోవడం ‘అసత్’ అనుకుందాం. దీనిలో నుండి సత్యమైన దానిని, నిత్యమైన దానిని పొందడం ‘సత్’గమం అవుతుంది. ప్రపంచ మిధ్య కాదు. మనం transmit అవడం ముఖ్యం. కాదంటారా? మీరూ ఆలోచించండి!
చదువుకుని ఆలోచించగలవారు కూడా స్వంతంగా, స్వతంత్రంగా ఆలోచించడం లేదు. ఇతరుల ఆలోచనల్ని కాపీ కొట్టి తమ స్వంతం అనుకుంటారు. ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మడం మేధావి లక్షణం కాదు. నా భావంలో సత్ అంటే – existence. అంటే అస్తిత్వం . అస్తిత్వం ప్రక్కన స్థిరత్వం అనే మరొక పదం చేర్చండి. ఇప్పుడు చెప్పండి అస్తిత్వం అంటే ఏమిటి? ఎలా ఏర్పడింది. అయితే existence కు ముందర ఉన్న స్థితి ఏమై ఉంటింది.
Existence కి ముందర ఏమీ లేనట్లే కదా!
అవును కదూ. Non-existence అంటే nothingness అంటే శూన్యత అనేది Origin అన్న మాట. Emptiness అంటే nothingness అవుతుంది. అంటే ‘అసత్’ అన్న మాట. Non existence నుండి existence పుట్టుకొచ్చింది. అది “అసతోమా సత్ గమయ”.
మరొక విధంగా చెప్పాలంటే అస్థిరంగా ఉన్న మనస్సు స్థిరం కావడం. అంటే అస్తిత్వం ఆఖరు కాదు. పరిమాణం ఉంది మద్యలో. అస్తిత్వం అద్యాత్మికంగా పరిణమించాలి. మనస్సు ఆత్మ వేపు పరిక్రమించాలి. అందుకు మనం పరిస్రమించాలి. అదే యోగం. అదే సాధన. అస్తిత్వంతో పరిణామం ఆగదు. జీవుని ప్రయాణం ఆగదు. అశాశ్వతమైన దాని నుండి శాశ్వతమైన దాన్ని అందుకోవాలి. అదీ అసత్ నుండి సత్ కు పరిణామం. అంటే జీవుని యాత్ర అశాశ్వతం నుండి శాశ్వతత్త్వంలోకి. అదీ అసలైన జీవయాత్ర..
మనిషి జీవయాత్ర - జీవనయాత్ర కాదు.
అది మేధ వల్ల జరగదు. ఆత్మ సహకారంతో జరుగుతుంది. జరగవలసింది ఆత్మ పరిణామం. ఇంతవరకు సృష్టి పరిణామం, జీవ పరిణామం గురించి మీరు విని ఉంటారు. నేను చెప్పేది ఆత్మ పరిణామం గురించి, అదే నేను చేసే యోగం. ఇది ఆత్మ యోగం. ఆత్మ జాగృతి కోసం చేసే సాధన.
ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. కానీ అందరిలోనూ అది జాగృతం కాదు. బహిర్గం కాదు. చైతన్యం పొందదు. బహుకొద్ది మందిలో ఆత్మ జాగృతి కలుగుతుంది. అందరిలోనూ ఎందుకు కలగడం లేదంటే ఆ దిశగా పయనించక, ప్రయత్నించక పోవడమే కారణం. మనస్సు చీకటి గదుల్లో ఆత్మ నిద్రిస్తూ ఉంటుంది. దానిని నిద్ర లేపి జాగృతం చేయాలి. మనవారు కుండలినీ శక్తిని లేపడానికి యత్నిస్తారు. నిజానికి నిద్రలేపవలసింది, చీకటి నుండి వెలుగులోకి తీసుకురావలసింది ఆత్మను. అది “తమసోమా జ్యోతిర్గమయ” అంటే అర్ధం. కస్టపడి, నానా అవస్థలు పది కుండలినీ శక్తిని లేపినా అది కడకు చేసే పని ఆత్మను తట్టి నిద్ర లేపడమే. ఆ పనేదో మనస్సుతో మనమే చేసుకోవచ్చు.

ఆత్మ ఆచూకీ తెలిస్తే కదా దానిని జాగృత పరచడం అంటారు. ముందు మనస్సును సన్మార్గంలో పయనింప చేస్తే ఆ సంస్కారం ఆత్మ జాగృతికి ఉపకరిస్తుంది. మనస్సు వెలుగు ముద్దగా మారితే, ‘ఆత్మ’ ఉండేందుకు తమస్సు లేక, నిద్రలేస్తుంది. జాగ్రుతమవుతుంది. అలా direct గా ఆత్మ వ్యవహారం పట్టించుకోవచ్చునని నా సిద్ధాంతం.

No comments:

Post a Comment