Saturday, June 22, 2013

మానవుని జీవితం అందమైనది,శక్తిమంతమైనది. అలాంటి జీవితం మీద బాధ్యత ఉండాలి.చింతకూడదు.ఎందుకు?



నేను పుట్టినప్పుడు మా ఇంటికి ఒక జోష్యుడు వచ్చాడట.ఆయన మనసులో తోచింది ఎప్పుడూ మారదని,మా అమ్మ ,ఆయనని నా జాతకం చూడమని అడిగిందట.నా చూడగానే ఆయన నేను చాల గొప్పవాడి నవుతానన్నారట .

 అమ్మ ఈ మాట నే గెలుపొందిన ప్రతిసారీ చెప్పేది.నాకు నవ్వు వచ్చేది."జోస్యమా? జాతకమా? నేను కస్టపడి సాధించేనాటికి విధిని ఎందుకని కారణం చేస్తావు? అని ఆమెతో వాదిన్చేవాడిని.

నిజానికి నేను అధ్రుష్టవంతుడినా,కాదా? నా జీవితపు పుటలు కళ్ళముందు పరచుకుంటున్నాయి.

బడిలో బలవంతంగా  కూర్చోవాల్సి వచ్చినప్పుడు ,కిటికీ పక్కనే కూర్చునేవాడిని,కొందరు ఉపాధ్యాయులు తమ హృదయంలోంచి పాఠం చెప్పేవారు.చాలామంది తమ బుర్రలో ఉన్నదాన్నిగొడవ గొడవగా జార్చేస్తుంటారు.పరీక్షల్లో పాసవడానికి ఆ గొడవంతా పనికి వస్తింది,కాని జావితం పరిపూర్నమవడానికి కాదు.

బయట తోటలో విరబూసిన పువ్వుల్ని చూస్తాను.అవన్నీ స్వతంత్రంగా గాలిలో తలలుఊపుతుండటం చూస్తే,తరగతిగదే మూర్ఖుల ఖైదులా అనిపిస్తుంది.

నాకే కాదు.హుషారుగా తిరిగేవాల్లకు ఎవరికైనా తరగతి గది ఖైదులాగే అనిపిస్తుంది.మీకు ఏది సంతోషమో,ఏవి హుషారు కలిగిస్తాయో నాకేల తెలుస్తుంది.నావరకు మాత్రం ...వేడుక ఆటలు ;సరదా సంతోషం;హుశారుగోలిపే చర్యలు.

నా యవ్వనాన్ని ఆనందంగా గడిపాను.స్కూల్ నుంచి కాలేజీకి సాగింది బతుకు బండి.

నీవే నేనుగా మారవచ్చు.
నీలాగే నేను పుట్టాను.
నీలాగే నేను తిన్నాను.
నీలాగే నేను నిదురించాను.
నీలాగే నేను రాలిపోతాను -అయినా,
ఈ ఎల్లలు నాకు సంకెలలు కాలేదు||
ఈ చిన్న జీవితం నన్ను చేరపట్టలేదు||
నడయాడే ప్రాణం అనుదినం ఎదిగేలా
అందానికి ఎల్లలు అడ్డు తొలగిపోయాయి||
అంతంలేని అమృతమైంది||
ప్రేమే రూపుగా మారు
నీవే నేనుగా మారవచ్చు.

కాలేజీ రోజుల్లో నేనూ,నా స్నేహితులు కలసి 'రావి చెట్టుక్లబ్' ఒకటి ప్రారంబించాం!
ఎవేవో మాట్లాడేవాళ్ళం! సంతోషంగా తిరిగేవాళ్ళం! మా హెల్మేటు మీద 'ఆనందం అనే మంత్రం' అని రాసుకునేవాళ్ళం! కాలేజీ రోజుల కంటే,ఆ మర్రిచెట్టు కిందే సంతోషంగా గడిపేవాళ్ళం.

యవ్వనంలో అలా ఉండటమే సహజం.అది వదిలేసి,ఇప్పుడు పదేల్లప్పుడే,కంప్యూటర్ నేర్చుకోవడంలో మునిగి తేలే వాళ్ళను చూస్తే జాలి కలుగుతోంది.

స్కూల్ కి సెలవులిచ్చినప్పుడు కూడా తమ బిడ్డలు ఏదైనా నేర్చుకుని కొత్త విషయాల్ని బుర్రలోకి ఎక్కించుకోవాలని చూస్తున్నారు. తల్లిదండ్రులు నేనిలా అనగానే,'కంప్యూటరే రేపటి ప్రపంచం!' అనే గొంతులే వినిపిస్తాయి.అది తప్పు.ఆనాడు,ఈనాడు,ఏనాడూ మనిషే ప్రపంచాన్ని ఎలుతాడు.కంప్యూటర్ కాదు,యంత్రాలు కాదు.

యంత్రాలు రోజురోజుకి మారుతాయి.గౌరవాన్ని పోగొట్టుకుంటాయి.ఒక పరిస్థితిలో మీరు కాదనేటట్టు కూడా ఉంటుంది.అవి పైపై విషయాలే.అయితే మానవ జాతే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గొప్ప శక్తి.

ఆడుకోవలసిన వయసులో రేపటి భవిష్యత్ ఏమిటో అన్న భయాన్ని మీలో చొరబదనీయకండి.జీవితం మీద భాద్యత ఉండాలి,చింతకూడదు.ఎందుకంటే,సంతోషంగా దేన్నయినా నేర్చుకోవచ్చు, దుఃఖంతో కాదు.
                                                                                                                  

                                                                         మౌనంతో రహస్యం
                                                                        సద్గురు జగ్గీ వాసుదేవ్

No comments:

Post a Comment